నడి రోడ్డుపై రూ.500 నోట్లు.. పోటీపడి ఎగబడ్డ జనం.. ఎక్కడంటే?(వీడియో)

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.

నడి రోడ్డుపై రూ.500 నోట్లు.. పోటీపడి ఎగబడ్డ జనం.. ఎక్కడంటే?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు కొంత మొత్తంలో నగదు దోచుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో వారి బ్యాగులో నుంచి డబ్బులు కింద పడిపోవడంతో అక్కడున్నవారంతా వాటి కోసం ఎగబడ్డారు. కింద పడిపోయిన ఆ డబ్బులను చూసిన వారు ఒకరిని మించి ఒకరు తగ్గేదెలే అన్నట్లుగా పోటీపడి మరీ తీసుకుంటున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని కోఖ్రాజ్‌లో జరిగింది.

కొందరు గుర్తు తెలియని దుండగులు ఒక వ్యాపారి నుంచి రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌(Bag)ను లాక్కొని పారిపోయారు. ఈ క్రమంలో ఆ బ్యాగ్ హైవేపై పడిపోవడంతో నోట్లన్నీ రోడ్డు పై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇది చూసిన ప్రజలు ఆ డబ్బులను తీసుకోవడానికి ఎగబడ్డారు. కొంతమంది కింద పడిన డబ్బులు తీసుకోవడం చూసిన వాహనాదారులు.. బైక్‌ను ఆపి మరీ వారు కూడా డబ్బులు ఎరుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ఘటన పై నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story