- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: బీజేపీ మద్దతుదారులను కాంగ్రెస్ నుంచి ఎప్పుడు బహిష్కరిస్తారు?
కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్న వారిని ఎప్పుడు బహిష్కరిస్తారు? అని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలోని భారతీయ జనతా పార్టీ మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరుతూ కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న గుజరాత్‌లో కాంగ్రెస్ సంస్థాగత బలహీనత గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. గుజరాత్ కాంగ్రెస్‌లో కొందరు నేతలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని, అవసరమైతే వారిపై వేటు వేసేందుకు వెనుకాడేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్న వారిని ఎప్పుడు బహిష్కరిస్తారు? అని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. గుజరాత్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు, ఆర్ఎస్ఎస్‌కి వ్యతిరేకంగా మాట్లాడవద్దని నాకు సూచనలు అందాయి. దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. అయితే, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు మతం పేరుతో హిందువులను దోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నిజానికి ఆర్ఎస్ఎస్ హిందువులకు ప్రాతినిధ్యం వహించదు. బదులుగా మతం పేరుతో వారిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, వారినే దోపిడీ చేస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా హిందూ ఆధ్యాత్మిక నేతలు స్థాపించిన శంకరాచార్యుల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. వారిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను సపోర్ట్ చేసినవారెవరైనా ఉన్నారా అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.






