- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maha Kumbh: వాట్సాప్ లో ఫోటోకు పుణ్యస్నానాలు.. కుంభమేళాలో కేటుగాళ కొత్త దందా!
మహాకుంభమేళాలో వాట్సాప్ లో పుణ్యస్నానాల పేరుతో కొత్త దందా వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా (Maha Kumbh Mela) కొనసాగుతున్నది. 144 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు (Holy Dip) ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివెళ్తున్నారు. మరో రెండువారాల్లో ముగియనుండగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి భక్తులు తరలివెళ్తున్నారు. ఇక మరికొంతమంది తమ పరిస్థితులు, వివిధ కారణాలతో వెళ్లలేకపోతున్నారు. ఇదే అదునుగా చేసుకున్న కేటుగాళ్లు ఇలాంటివారి కోసం కొత్తరకం దందాకు తెరలేపారు. ‘కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానం చేయలేక పోతున్నారా? మరేం పర్వాలేదు. రూ.500 తో పాటు వాట్సాప్ మీ ఫోటోలను మాకు పంపించండి. వాటిని మేము ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయిస్తాం. దాంతో మీ పాపాలన్నీ పోతాయి’ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ‘ఆలసించిన ఆశాభంగం.. మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదు. త్వరపడండి’ అంటూ వాట్సాప్ నంబర్‌తో కూడిన అడ్వర్టైజ్‌మెంట్ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడీ ప్రచారం వైరల్‌గా మారింది. దీంతో ఇప్పటికే కుంభమేళాలో రకరకాల వ్యాపారాలతో కొంతమంది కాసుల పంట పండించుకుంటుంటే భక్తుల మనోభావాలతో ఇదేం పని అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వాట్సాప్ పుణ్యస్నానాల్లో (WhatsApp Holy Baths) ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన యాడ్ క్లిప్పింగ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






