- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో వాట్సప్‌పై నిషేధం..? ప్రభుత్వం సంచలన ఆరోపణలు
వాట్సాప్‌పై ప్రభుత్వం నిషేధం విధించబోతోందా అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రష్యా (Russia)లో వాట్సాప్‌పై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించబోతోందా అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా ఆ దేశ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ రోస్‌కామ్‌నాడ్జోర్ కీలక ప్రకటన చేసింది. వాట్సాప్ (Whatsaap) స్థానిక నేర నిరోధక చట్టాల ఉల్లంఘనలను సరిదిద్దకపోతే దేశంలో పూర్తిగా బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. వాట్సాప్‌ను ఉగ్రవాద దాడులు నిర్వహించడానికి, నేరస్థులను రిక్రూట్ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేసింది. ఇప్పటికే గత ఆగస్టులో వాట్సాప్‌లోని వాయిస్, వీడియో కాల్స్‌పై ఆంక్షలు విధించారు. అక్టోబర్‌లో వాట్సాప్ రిజిస్ట్రేషన్, లాగిన్ కోసం ఎస్‌ఎంఎస్ (SMS) వెరిఫికేషన్ కోడ్‌లు పంపే విషయంలోనూ మొబైల్ ఆపరేటర్లకు నిషేధాజ్ఞలు జారీ చేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ పాస్‌కీ లాగిన్ ఆప్షన్ తీసుకొచ్చింది.
ఇక మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ (Telegram)పై కూడా ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్‌ఫాక్స్ ద్వారా రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ‘రష్యన్ చట్టాల డిమాండ్లను నెరవేర్చకపోతే పూర్తిగా బ్లాక్ చేస్తాం’ అని రోస్‌కామ్‌నాడ్జోర్ పేర్కొంది. అయితే వాట్సాప్‌పై బ్యాన్ విషయంలో సమయ పరిమితి, అమలు తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు దేశీయ యాప్‌లను మాత్రమే వాడాలని రష్యా కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ రోస్‌కామ్‌నాడ్జోర్ సూచించింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ దాడి తర్వాత పాశ్చాత్య టెక్ కంపెనీలపై ఆంక్షలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిస్థితులు తలెత్తాయి.






