- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Whatsapp Update : సరికొత్త ఫీచర్లతో వాట్సాప్ యాప్
సెల్ ఫోన్ యూజర్ల(Cell Phone Users)ను ఎప్పటికప్పుడు తన సరికొత్త అప్డేట్స్(Update)తో ఆకట్టుకును వాట్సాప్ యాప్(WhatsApp App) తన యూజర్ల కోసం 2025లో మరిన్ని సరికొత్త ఫీచర్ల(New Features)ను తీసుకోస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : సెల్ ఫోన్ యూజర్ల(Cell Phone Users)ను ఎప్పటికప్పుడు తన సరికొత్త అప్డేట్స్(Update)తో ఆకట్టుకును వాట్సాప్ యాప్(WhatsApp App) తన యూజర్ల కోసం 2025లో మరిన్ని సరికొత్త ఫీచర్ల(New Features)ను తీసుకోస్తుంది. ముఖ్యంగా యూజర్ల ప్రైవసీ, డేటా సెక్యూరిటీలకి పెద్ద ప్రాధాన్యత ఇస్తామని సంస్థ పేర్కొంది. ఫొటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్లు, స్టిక్కర్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్స్ వంటి ఫీచర్లు యూజర్ల చాట్ సమయాన్ని ఆసక్తిగా మార్చనున్నాయి. తాజాగా రాబోయే అప్డేట్ లో సెల్ఫీ(Selfie Sticker) స్టిక్కర్ క్రేజీగా కనిపిస్తుంది.
సెల్ఫీ స్టిక్కర్ తయారీతో పాటు, ఫోటో ఎడిటింగ్(Photo editing) మెసేజ్(Message)లకు త్వరగా రియాక్ట్ (Quick React)అయ్యే ఆప్షన్లతో ఈ కొత్త ఫీచర్లు ఆసక్తి రేపుతున్నాయి. సెల్ఫీ స్టిక్కర్ ఫీచర్ తో యూజర్లు వారి సెల్ఫీని స్టిక్కర్ గా మార్చుకోవచ్చు. "క్రియేట్ స్టిక్కర్" ఆప్షన్ ద్వారా సెల్ఫీ తీసుకుని, దాన్ని వ్యక్తిగతీకరించిన స్టిక్కర్ గా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ముందు ముందు ఐఓఎస్ యూజర్ల కోసం కూడా త్వరలోనే విడుదల కానుంది.
అలాగే ఇప్పుడు మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్స్ లను స్నేహితులకు నేరుగా షేర్ చేయవచ్చు. మీ స్నేహితులతో మీ ఫేవరేట్ స్టిక్కర్ ప్యాక్ లను పంచుకుంటూ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సరదాగా మార్చుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇకపై మెసేజ్ కు రియాక్ట్ అవ్వడం మరింత వేగవంతం కానుంది. మెసేజ్ పై డబుల్ ట్యాప్ చేస్తే రియాక్షన్ సెట్ అవుతుంది. ఇందులో భాగంగా ఎక్కువగా వాడే ఎమోజీలను స్కోలింగ్ మెనూలో నుండి ఎంపిక చేసుకోవచ్చు.
అలాగే కొత్త ఫీచర్లలో ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు(Special Features) జోడించే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫోటోలను షేర్ చేసే ముందు వివిధ ఫిల్టర్లు, బ్యాక్ గ్రౌండ్స్, విజువల్ ఎఫెక్ట్స్ జోడించవచ్చు. 30కి పైగా క్రియేటివ్ ఆప్షన్లను ఉపయోగించి మీ మెసేజ్ లను మరింత ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా మార్చుకోవచ్చు.






