Supreme Court: ఈ సమస్య సున్నితత్వం మీకు అర్థం కాదా?- సుప్రీంకోర్టు

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంతో టూరిస్టుల భద్రతపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court: ఈ సమస్య సున్నితత్వం మీకు అర్థం కాదా?- సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంతో టూరిస్టుల భద్రతపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనం కోసం కాకుండా ప్రచారం కోసం మాత్రమే ఈ పిల్ ని దాఖలు చేశారని పిటిషనర్ ని మందలించింది. కాగా.. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "మీరు ఈ రకమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎందుకు దాఖలు చేశారు? మీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఈ సమస్య సున్నితత్వం మీకు అర్థం కాలేదా? ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడానికి మీరు కొంత అసాధారణమైన నష్టాన్ని ఆహ్వానిస్తున్నారని నేను భావిస్తున్నాను" అని జస్టిస్ సూర్యకాంత్ తివారీ పిటిషనర్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కోర్టు ఆగ్రహం..

జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి అని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకే టూరిస్టుల భద్రత కోసం తాను ఆదేశాలు కోరుతున్నానని చెప్పారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్ ఒకదాని తర్వాత ఒకటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంలో మునిగిపోతున్నారు. కాగా.. దీనివెనుక ఉన్న అసలైన ఉద్దేశం ప్రచారం మాత్రమే అని మండిపడింది. మరోవైపు, జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాం (Pahalgam terror attack)లో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది.

Next Story