‘పిల్లోడు చెప్పడమే ఆలస్యం.. స్కూల్‌కి వచ్చి రెచ్చిపోయిన పేరెంట్స్’.. టీచర్‌ను చితకబాదిన వైనం

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-06 14:35:28  IST  )

రాష్ట్రంలోని ఓ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

‘పిల్లోడు చెప్పడమే ఆలస్యం.. స్కూల్‌కి వచ్చి రెచ్చిపోయిన పేరెంట్స్’.. టీచర్‌ను చితకబాదిన వైనం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఓ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిహార్‌లోని గయా జిల్లాలో తమ కొడుకును కొట్టిన టీచర్‌పై తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఆ విద్యార్థి పేరెంట్స్ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, ఐదో తరగతిలో ఇద్దరు పిల్లలు కొట్టుకోవడంతో టీచర్ రాకేష్ వారిని ఆపి చెంపదెబ్బలు కొట్టారు.

అందులో ఒక పిల్లవాడు ఉపాధ్యాయుడు కొట్టిన విషయం పై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు నిమిషాల్లోనే పాఠశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి పేరెంట్స్ ఉపాధ్యాయుడు రాకేష్ పై పిడిగుద్దులు, చెంపదెబ్బలతో రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా కర్రలతో కొట్టారు. అడ్డుకోబోయిన మరో ఉపాధ్యాయుడిపై కూడా దాడి చేశారు. దీంతో ఆ పాఠశాలలోని విద్యార్థులు భయంతో క్లాస్ రూమ్‌లోకి వెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఉపాధ్యాయులు రాకేశ్ రంజన్, ధర్మేంద్ర కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story