- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆధార్, పాన్ కార్డులు పోగొట్టుకున్నారా? అయితే ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి!
మన దేశంలో ఆధార్, పాన్ కార్డు అతి ముఖ్యమైన డాక్యుమెంట్లు.

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో ఆధార్ (Aadhar), పాన్ (PAN) కార్డు అతి ముఖ్యమైన డాక్యుమెంట్లు. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాకుండా ప్రైవేట్ సంబంధిత పనులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే, ఆర్థిక పరమైన ఎలాంటి లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, ఎంతో కీలకమైన ఈ కార్డులు పోతే పరిస్థితి ఏంటి? ఏ విధంగా తిరిగి పొందాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డు పోతే ఏం చేయాలంటే?
* రోజువారీ జీవితంలో కీలకంగా మారిన ఆధార్ కార్డు పోతే మళ్లీ తిరిగి పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో ఆధార్ కార్డును తిరిగి పొందవచ్చు.
* ముందుగా uidai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ కార్డును మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* వెబ్‌సైట్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, కింద ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
* ఆధార్ కార్డు మీ ఫోన్ నంబర్‌కు లింక్ అయి ఉంటే, మీ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది.
* దానిని ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.
* అయితే, మీ ఆధార్ కార్డుకు మీ ఫోన్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.
* ఇక ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డు పొందాలనుకుంటే.. ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి మీ వివరాలు చెప్పి, ఆధార్ కార్డును పొందవచ్చు.
* అలాగే, ఆధార్ కార్డు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆధార్ కార్డు తప్పనిసరిగా బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలి.
పాన్ కార్డు పోతే ఏం చేయాలంటే?
* ముందుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్‌సైట్ onlineservices.nsdl.com లోకి వెళ్లి రిక్వెస్ట్ ఫర్ రీ ప్రింట్ పాన్ కార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత పాన్ కార్డు నంబర్, ఆ కార్డుకి లింక్ అయి ఉన్న ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీ నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
* మరో వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పాన్‌కార్డు రీప్రింట్ కోసం నిర్ణీత రుసుము చెల్లించి, పాన్ కార్డును పొందవచ్చు.
* అలాగే, పాన్ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున దానిని పోగొట్టుకుంటే.. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పాన్ కార్డు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు (FIR) దాఖలు చేయాలి.
* డూప్లికేట్ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇది అవసరం పడవచ్చు.






