- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుహలో రష్యన్ మహిళ కేసు.. భర్తపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కర్ణాటకలోని గోకర్ణలో ఒక గుహలో తన ఇద్దరు కూతుర్లతో రహస్యంగా జీవిస్తోన్న రష్యన్ మహిళ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని గోకర్ణలో ఒక గుహలో తన ఇద్దరు కూతుర్లతో రహస్యంగా జీవిస్తోన్న రష్యన్ మహిళ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మహిళ వద్ద ఉన్న ఇద్దరు పిల్లలకు తండ్రిని తానేనంటూ ఇజ్రాయెల్ కు చెందిన వ్యాపారవేత్త ప్రకటించుకున్నాడు. వారిని రష్యాకు పంపవద్దని వేడుకుంటూ.. గోల్డ్ స్టీన్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. గోల్డ్ స్టీన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రష్యన్ మహిళ నైనా కుటినా (40) గతంలోనే తన భర్త ఇజ్రాయెల్ కు చెందిన వ్యాపారవేత్త అని తెలిపింది. అతని జాడ తెలియకపోవడంతో.. తల్లి, పిల్లలు భారత పోలీసుల సంరక్షణలో ఉన్నారు. ఆ పిల్లలిద్దరూ తన పిల్లలేనని తెలిపే ప్రూఫ్ చూపించాలని ధర్మాసనం ఆదేశించింది. భార్య, పిల్లలు గుహలో ఉంటుంటే.. మీరు గోవాలో ఏం చేస్తున్నారంటూ అత్యున్నత న్యాయస్థానం ఫైరయింది. భారతదేశం అందరికీ స్వర్గధామంగా మారిందని, ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండిపోవచ్చునని అనుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది.






