- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Election Results : ఎన్నికల రాష్ట్రాల మ్యాజిక్ ఫిగర్ ఎంతంటే..?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మిక్స్డ్ రిజల్ట్ ఉంటాయని చెబుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలిపోతాయి. తమిళనాడు, కేరళం, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. ఇక సమయం గడిచే కొద్దీ అభ్యర్థుల జాతకాలు బయటపడతాయి.
మొన్న జరిగిన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మిక్స్డ్ రిజల్ట్ ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ హాట్ టాపిక్ అయింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉండగా, 148 మ్యాజిక్ ఫిగర్ కానుంది. తమిళనాడులో 234 సీట్లు ఉన్నాయి. అక్కడ 118 మ్యాజిక్ ఫిగర్. కేరళంలో 140 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 71. పుదుచ్చేరిలో 30 సీట్లు ఉండగా 16 సీట్లు దక్కించుకున్న వాళ్లకు అధికారం రానుంది. అస్సాంలో 126 సీట్లు ఉండగా, 64 మ్యాజిక్ ఫిగర్ కానుంది.






