- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mock Drills: హైదరాబాదీలు బీ అలర్ట్.. మాక్ డ్రిల్‌ఎప్పుడు? మీరేం చేయాలో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పోలీసులు, ఫైర్, రెస్క్యూ, మెడికల్, మున్సిపల్ వంటి 12 శాఖల సివిల్ డిఫెన్స్ సర్వీసెస్‌లు ఓఆర్ఆర్ పరిధిలోపల డ్రిల్ చేపడతారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ కంటోన్మెంట్, కంచన్ బాగ్, నాచారంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం దాడి తర్వాత పౌరులూ అలర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ చేపడుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పోలీసులు, ఫైర్, రెస్క్యూ, మెడికల్, మున్సిపల్ వంటి 12 శాఖల సివిల్ డిఫెన్స్ సర్వీసెస్‌లు ఓఆర్ఆర్ పరిధిలోపల డ్రిల్ చేపడతారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ కంటోన్మెంట్, కంచన్ బాగ్, నాచారంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
మాక్ డ్రిల్ ఎలా జరుగుతుంది?
టైం- సాయంత్రం 4 గంటలు: హైదరాబాద్ నగరవ్యాప్తంగా సైరెన్లు యాక్టివేట్ చేస్తారు. ఇందుకు ఇండస్ట్రియల్, పోలీసు మైక్‌లు, పెట్రోల్ వాహనాలు, ఫైర్ సైరన్లు వినియోగిస్తారు. రెండు నిమిషాలపాటు సైరన్లు మోగుతాయి. వైమానిక దాడుల ముప్పు ఉన్నదని అర్థం చేసుకోవాలి.
ఏం చేయాలి?: సైరన్లు వినపడగానే పౌరులు నిశబ్దంగా వెంటనే సమీపంలోని బిల్డింగ్ లేదా అండర్‌గ్రౌండ్ షెల్టర్‌లలోకి వెళ్లి తలదాచుకోవాలి. టీవీ, రేడియో లేదా ప్రభుత్వ యాప్‌ల నుంచి అప్‌డేట్ కోసం ఎదురుచూడాలి. అధికారిక సూచనలు మాత్రమే పాటించాలి. ఇంటిలోని ఎలక్ట్రానిక్ అప్లయెన్స్, గ్యాస్, ఓపెన్ ఫ్లేమ్ వంటి స్టవ్, అగ్ని పుట్టించే పరికరాలను కట్టేయాలి. ఆపద తప్పిందనే అధికారిక సమాచారం వచ్చేదాకా జాగరూకతగా, ఓపికగా అప్‌డేట్ కోసం చూడాలి. మీకు సమీపంలో ఆశ్రయాలేమీ లేకుంటే.. వంపున్న ప్రాంతంలో బార్లాపడుకుని తలను కవర్ చేసుకోవాలి. వీలైనంతవరకు మిమ్మల్ని మీరు ఎక్కువ కనిపించకుండా జాగ్రత్త వహించాలి.
టైం-4.15 గంటలు: వైమానిక దాడి ప్రభావాన్ని సివిల్ డిఫెన్స్ సర్వీస్‌లకు ఐసీసీసీ అలర్ట్ చేస్తుంది. సేవలందించాలని నగరంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లోని శాఖలను ఆదేశిస్తుంది.
ఏం జరుగుతుంది?: పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, రెస్క్యూ/ఎస్‌డీఆర్ఎఫ్, మెడికల్, రెవెన్యూ/లోకల్ మున్సిపల్ అధికారులు స్పాట్‌కు ఐదు నిమిషాల్లో చేరుకోవాలి. పోలీసులు వెంటనే కార్డన్ ఆఫ్ నిర్వహించడం, మూకను నియంత్రించడం, జాప్యం లేకుండా క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించడానికి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమవ్వాలి. ఫైర్ సర్వీసెస్ వెంటనే మంటలను ఆర్పేయాలి. ఎస్‌డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే శిథిలాలను తొలగించి ఇతర సివిల్ డిఫెన్స్ పనులకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. సివిల్ డిఫెన్స్ వార్డెన్లు జరిగిన నష్టాన్ని సమీక్షించడం, మిస్సింగ్ పర్సన్ల జాబితాను సిద్ధం చేసి ఫైర్ బ్రిగేడ్‌లకు అందించాలి. మెడికల్ సర్వీస్ సిబ్బంది క్షతగాత్రులకు ఆలస్యం లేకుండా ప్రథమచికిత్స అందించాలి. స్పాట్ నుంచి ప్రజలను బయటికి తీసుకువచ్చి ముందస్తుగా గుర్తించిన ఆశ్రయాలు, బంకర్లకు ట్రాన్స్‌పోర్టు సర్వీస్ సిబ్బంది తీసుకెళ్లాలి. జీహెచ్ఎంసీ, సివిల్ సప్లైస్, రెవెన్యూ, ఇతర స్థానిక సంస్థల సిబ్బంది ఆశ్రయాల్లో ప్రజలకు అవసరమైన రిలీఫ్ సర్వీస్‌లు అందించాలి.
బ్లాక్ ఔట్ యాక్షన్: వైమానిక దాడి సమయంలో నష్టాన్ని తగ్గించుకోవడానికి ఈ యాక్షన్ తీసుకుంటారు. బ్లాక్ ఔట్ నిర్ణయంలో వెంటనే వీధి దీపాలు, బిల్డింగ్ లైట్లు, ఇతర మిరిమిట్లు గొలిపే వాటిని ఆర్పేయాలి. ఇంటిలోని కాంతి బయటికి రాకుండా కిటికీలు మూసుకోవాలి. వాహనాల లైట్ల తీవ్రత తక్కువ ఉండేలా చూసుకోవాలి. పవర్ స్టేషన్లు, కమ్యూనికేషన్ టవర్లను ఏమర్చేలా దాచిపెట్టి వైమానిక దాడికి గురికాకుండా కాపాడుకోవాలి. లైట్లు ఆర్పేయడం వల్ల శత్రు విమానాల కంటబడకుండా జాగ్రత్త పడాలనేదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం.
టైం-4.30 గంటలు: సైర్లను మోగించి డ్రిల్ ముగించాలని ఐసీసీసీ ఆదేశిస్తుంది. హైదరాబాద్ నగరంలోని అన్ని చానెళ్లకు డ్రిల్ ముగిసినట్టు సమాచారం అందిస్తుంది.






