ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతులున్న దేశాలివే.. భారత్ స్థానం ఎంతంటే?

by Jakkula.Mamatha |

దేశాభివృద్ది(development) ఆ దేశంలో ఉన్న విద్యావంతుల(Educated) సంఖ్య పై ఆధారపడి ఉంటుందని విషయం తెలిసిందే.

ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతులున్న దేశాలివే.. భారత్ స్థానం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: దేశాభివృద్ది(development) ఆ దేశంలో ఉన్న విద్యావంతుల(Educated) సంఖ్య పై ఆధారపడి ఉంటుందని విషయం తెలిసిందే. అందుకే ప్రపంచ దేశాలు సంక్షేమంతో పాటు విద్యకు(Education) అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రజలను(People) విద్యావంతులు చేసేందుకు గాను ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. మరి ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు ఉన్న దేశం ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది.

అదే విధంగా తమ దేశం(Country)లో ఎన్నో స్థానంలో ఉందో కూడా తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో భారత్‌(India) అత్యధిక విద్యావంతులున్న జాబితాలో ఏ స్థానంలో ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా(Worldwide) ఏయే దేశాల్లో అత్యధిక విద్యావంతులు(Educated) ఉన్నారనే విషయాన్ని ఓ నివేదికలో వెల్లడించారు.

అసలు విషయంలోకి వెళితే.. ప్రపంచంలోనే జపాన్‌(Japan)లో అత్యధికంగా విద్యావంతులు ఉన్నట్లు తాజాగా విడుదలైన ఓ నివేదికలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో భారతదేశం(India) 53వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. చైనా 27, అమెరికా 22వ స్థానంలో ఉన్నాయి. విద్యావంతులు కలిగిన దేశాల జాబితా వరుసగా.. జపాన్(Japan), స్వీడన్(Sweden), స్విట్జర్లాండ్(Switzerland), జెర్మనీ(Germany), డెన్మార్క్(Denmark), కెనడా(Canada), నార్వే(Norway), నెదర్లాండ్స్(Netherlands), ఫిన్లాండ్(Finland), ఆస్ట్రేలియా(Australia), యూకే(UK), ఫ్రాన్స్( France), సౌత్ కొరియా(South Korea), ఐర్లాండ్(Ireland), ఇటలీ(Italy), యూఎస్‌ఏ(USA), స్పెయిన్, చైనా(China), రష్యా(Russia), యూఏఈ(UAE) ఉన్నాయి.

Next Story