ఉగ్రవాదిని లొంగిపోమ్మన్న తల్లి.. చివరికి ఏమైందంటే?(వీడియో)

by Jakkula.Mamatha |

జమ్మూకాశ్మీర్(Jammukashmir) పహల్గాంలో గత నెల(ఏప్రిల్) 22వ తేదీన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.

ఉగ్రవాదిని లొంగిపోమ్మన్న తల్లి.. చివరికి ఏమైందంటే?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్(Jammukashmir) పహల్గాంలో గత నెల(ఏప్రిల్) 22వ తేదీన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో భారత్(India) మెరుపు దాడులు నిర్వహించింది. భారత్–పాక్(India-Pak War) మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా పుల్వామా(Pulwama) జిల్లాలోని త్రాల్‌లో ఈ రోజు(గురువారం) భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

ట్రాల్‌లోని నాదర్ ప్రాంతంలో మరణించిన ఈ ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నవారిగా గుర్తించారు. వారిలో ఒకరైన ఆమిర్ నజీర్ ఇంటికి ఫోన్ చేసి తల్లితో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఇంటికి వచ్చేయమని తల్లి అతడిని కోరగా.. ‘సైన్యాన్ని రమ్మను చూసుకుంటా’ అంటూ అతడు బదులిచ్చాడు. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమిర్‌తో పాటు ఆసీఫ్ అహ్మద్ షేక్, యావర్ అహ్మద్ భట్ హతమయ్యారు.

https://x.com/ZeeNews/status/1922958948778598475

Next Story