- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు.. చివరికి ఏమైందంటే?
రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును నడిపే డ్రైవర్ హార్ట్ఎటాక్‌తో కుప్పకులాడు. బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆ డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్ విడిచిపెట్టాడు. అదే సమయంలో ఈ ఘటనను వెంటనే గమనించిన బస్ కండక్టర్ అప్రమత్తమై స్టీరింగ్ పట్టుకుని బస్సును పక్కకి తీసుకెళ్లాడు.
కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు(Tamilnadu)లోని పళని సమీపంలో చోటు చేసుకుంది. బస్సు రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే డ్రైవర్ ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఒక్కసారిగా డ్రైవర్ స్టీరింగ్ వదిలేయడంతో బస్సులోని ప్రయాణికులు ముందుకు పడిపోయారు. ఇది గమనించిన కండక్టర్ వేగంగా స్పందించి బ్రేకులు వేసి ప్రయాణికులను కాపాడారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.






