ఎయిరిండియా విమానంలో ఊహించని సంఘటన.. టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందంటే?

by Jakkula.Mamatha |

ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

ఎయిరిండియా విమానంలో ఊహించని సంఘటన.. టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జూన్ 12వ తేదీన జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. విమానాల్లో లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 2414(AI 2414) విమానం టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందు కాక్‌పిట్‌లో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతనికి వైద్యపరమైన అత్యవసర(Health Emergency) పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై ఎయిరిండియా ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. నిన్న(శుక్రవారం) ఉదయం బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో ఘటన జరిగినట్లు తెలిపారు.

విమాన కాక్​పిట్​లోకి పైలట్( Pilot) వెళ్లాక కొన్ని తప్పనిసరి పేపర్స్​ పై సంతకాలు చేయాల్సి ఉంది. అందులో టెక్ లాగ్​ వంటి దస్త్రాలు ఉంటాయి. వాటిపై సంతకాలు చేసిన సమయంలోనే కుప్పకూలిపోయారు అని తెలిపారు. పైలట్ కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని.. దీంతో విమానం కొద్దిసేపు నిలిచిపోయిందని అధికారులు పేర్కొన్నారు. మరో పైలట్ వచ్చాక ఆ విమానం బయలుదేరింది అన్నారు. ప్రస్తుతం పైలట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. పైలట్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది.

Next Story