తొలిసారి గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు.. ప్రజలు ఏం చేశారంటే?

by Jakkula.Mamatha |

స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన మన దేశంలో ఇంకా విద్యుత్ లేని, ఆర్టీసీ బస్సును చూడని గ్రామాలున్నాయి అంటే ఎవరు నమ్మరు.

తొలిసారి గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు.. ప్రజలు ఏం చేశారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన మన దేశంలో ఇంకా విద్యుత్ లేని, ఆర్టీసీ బస్సును చూడని గ్రామాలున్నాయి అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. గ్రామానికో బస్సు సర్వీసు కల్పించారు. కానీ.. తమిళనాడు(TamilNadu) రాష్ట్రంలో మాత్రం ఓ గ్రామానికి ఆర్టీసీ బస్సు(RTC Bus) సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ గ్రామానికి బస్సు ఎప్పుడు వస్తుందో ఇన్ని ఏళ్లు ఎదురుచూశారు. ఈ క్రమంలో వారికి రాష్ట్ర ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ చెప్పింది.

తమిళనాడులోని రామనాథపురం జిల్లా వన్నంగులం గ్రామానికి ఇన్ని సంవత్సరాలకు మొదటిసారి బస్సు వచ్చింది. ఇక ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవు. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చిందని.. ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు. మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తూ.. చప్పట్లు కొడుతూ పూలమాలలు వేసి, హారతి ఇచ్చి బస్సుకు ఘనంగా స్వాగతం పలికారు. అయితే.. ఇప్పటివరకు ఆ గ్రామానికి రవాణా సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం వన్నంగులం గ్రామానికి బస్సు సర్వీసును కల్పించించడంతో అక్కడి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story