వరదలో కొట్టుకుపోయిన వృద్ధ తండ్రి.. కొడుకు ఏం చేశాడంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-19 12:33:52  IST  )

రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

వరదలో కొట్టుకుపోయిన వృద్ధ తండ్రి.. కొడుకు ఏం చేశాడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుజరాత్‌(Gujarath)లోని పలు జిల్లాల్లో నిన్న(మంగళవారం) కురిసిన వర్షాలకు వరదలు ఏరులై పారుతున్నా యి. ఈ వరదల్లో చిక్కుకొని పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా వరదలు సంభవించాయి. బలమైన ప్రవాహాల ధాటికి నివాసితులు కొట్టుకుపోతున్నట్లు భయంకరమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా వరద(Floods)లో కొట్టుకుపోయిన ఓ వృద్ధుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తరుణంలో రాణివాడ గ్రామానికి చెందిన రాంభాయ్ చిబాభాయ్(71) వాగు దాటుతుండగా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొంత దూరం వెళ్లాక ఓ కొమ్మను పట్టుకుని ఆగాడు. తండ్రి కొట్టుకు పోతుండడంతో అతని కొడుకు తీవ్ర ఆవేదన చెందాడు. ఈ క్రమంలో అతను స్థానికుల సాయంతో తన తండ్రిని రక్షించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story