- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
H1B ఫీజు పెంపునకు కారణాలేంటి ? అసలు ట్రంప్ టార్గెట్ ఏంటి?
హెచ్1బీ వీసా దరఖాస్తుల ఫీజును ఉన్నట్లుండి లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో టెక్ కంపెనీలు షాక్ కు గురయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: హెచ్1బీ వీసా దరఖాస్తుల ఫీజును ఉన్నట్లుండి లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో టెక్ కంపెనీలు షాక్ కు గురయ్యాయి. అమెరికాలో ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలు ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కపెనీస్ (Nasscom) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో FY2026లో అమెరికా వెళ్లేవారిపై, అమెరికాలో ఉన్న కంపెనీలతో ప్రాజెక్టు వర్కుల విషయమై చర్చించేందుకు ఉద్యోగులను పంపే కంపెనీలపై మోయలేని భారం పడనుంది. అసలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాలేంటి? ఆయన టార్గెట్ ఏంటి?
హెచ్1బీ ఫీజు పెంపు వెనుక అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిన్నటి వరకూ 2805 డాలర్లుగా ఉన్న హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్షడాలర్లకు పెంచడం, దానిని 24 గంటల్లో అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించడం వెనుక.. తమదేశ ఉద్యోగులను రక్షించుకోవడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు నిపుణులు. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికులు భారత్, చైనా దేశాల నుంచి వెళ్లినవారే ఉంటున్నారు. అమెరికన్ వర్కర్ల కంటే మనవాళ్లు తక్కువ జీతానికే వెళ్లడంతో అక్కడివారికి ఉద్యోగాలు తగ్గడం, తక్కువ వేతనాలు వస్తున్నాయన్నది ట్రంప్ వద్ద పనిచేస్తున్న అధికారులు వాదిస్తున్నారట. అందుకే హెచ్1బీ ఫీజును పెంచితే కంపెనీలు అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయని అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియన్స్ నే టార్గెట్ చేసినట్లు సమాచారం.
ఈ ఏడాది హెచ్1బీ వీసాలను అత్యధికంగా పొందిన టెక్ కంపెనీల్లో అమెజాన్ ముందుంది. మైక్రోసాఫ్ట్, మెటా కూడా అత్యధిక వీసాలు పొందాయి. దీనిని ఓవర్ యూజ్ గా పరిగణించి.. ఫీజును పెంచితే టెక్ కంపెనీలు వీసాలను తగ్గించుకుంటాయని అమెరికా భావించిందని టెక్ నిపుణులు అంటున్నారు. లీగల్ ఇమ్మిగ్రేషన్ ను కూడా పరిమితం చేయడం ట్రంప్ లక్ష్యంగా తెలుస్తోంది. "అమెరికా ఫస్ట్" పాలసీలో ఇది ప్రధాన భాగంగా కనిపిస్తోంది. నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా తగ్గుతుందని అమెరికా భావిస్తోంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో టెక్ దిగ్గజ కంపెనీలపైనే అధిక భారం పడనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయడంలో కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నట్లు సమాచారం. సో.. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయడం సాధ్యం కాదని కొందరు భావిస్తున్నారు. కాగా.. అమెరికా పెంచిన వీసా ఫీజు వల్ల ఆ దేశానికే ఎక్కువ నష్టం అని అంటున్నారు సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత. ట్రంప్ భార్య కూడా హెచ్1బీ వీసా ద్వారానే అమెరికా వెళ్లారని, ఆయన ఇప్పుడు కేవలం బిజినెస్ మ్యాన్ లా మాత్రమే ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.






