West Bengal: గత ఆరు నెలల్లో ఏడు మరణశిక్షలు..!

by Shamantha N |

గత ఆరు నెలల్లో పశ్చిమబెంగాల్ కోర్టులు ఏడు మరణశిక్షలు విధించాయి. ఉత్తర కోల్‌కతాలో ఏడు నెలల చిన్నారిపై లైంగికదాడి, హత్యాయత్నానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద మంగళవారం ఉరిశిక్ష విధించింది.

West Bengal: గత ఆరు నెలల్లో ఏడు మరణశిక్షలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: గత ఆరు నెలల్లో పశ్చిమబెంగాల్ కోర్టులు ఏడు మరణశిక్షలు విధించాయి. ఉత్తర కోల్‌కతాలో ఏడు నెలల చిన్నారిపై లైంగికదాడి, హత్యాయత్నానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద మంగళవారం ఉరిశిక్ష విధించింది. ఈ నేరం 'అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన' కేసు కిందకు వస్తుందని వాదిస్తూ మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించింది. ఆ తర్వాత కోర్టు మరణశిక్ష విధించింది. గత ఏడాది నవంబర్ 30న ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడ్ని డిసెంబర్ 5 తెల్లవారుజామున ఝార్‌గ్రామ్ జిల్లాలోని గోపీబల్లావ్‌పూర్ ప్రాంతంలోని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు డిసెంబర్ 30న మొదటి చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా..కొన్ని రోజుల తర్వాత అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలో నివసించే కుటుంబానికి చెందిన చిన్నారి.. ఇప్పటికీ ఆర్జీ కర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిభాస్ ఛటర్జీ సోమవారం తెలిపారు. జనవరి 7న ప్రారంభమైన ట్రయల్ ప్రక్రియను పూర్తి చేయడానికి కేవలం 40 రోజులు పట్టిందని తెలిపారు. దీంతో, ఈ కేసులో నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది.

ఆరు నెలల్లో ఏడో మరణశిక్ష

అయితే, గత ఆరు నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో కోర్టులు విధించిన ఏడవ మరణశిక్ష ఇది. అంతేకాకుండా, మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోక్సో చట్టం కింద విధించిన ఆరో మరణశిక్ష కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్ 7న సిలిగురిలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి అదేఏడాది సెప్టెంబర్ 26న కోర్టు మరణశిక్ష విధించింది. అక్టోబర్ 5న దక్షిణ పరిగణాల జిల్లాలో పదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి డిసెంబర్ 6న మరణశిక్ష పడింది. అంతేకాకుండా, డిసెంబర్ 14న ఫరక్కాలో యువతిపై లైంగిక దాడి జరిగింది.ఆకేసులో 35 ఏళ్ల వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. మరోకేసులో 2021లో హుగ్లీ జిల్లాలో తల్లి, తండ్రి, సోదరిని హత్య చేసిన కేసులో దోషికి మరణశిక్ష విధించింది. నవంబర్ 24న గురాప్ ప్రాంతంలో ఐదేళ్ల బాలికకు చిప్స్ ప్యాకెట్ ఆశజూపి హత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి ఈఏడాది జనవరి 17 కోర్టు శిక్ష విధించింది.

Next Story