రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని రాజకీయాలా?.. మోడీపై దీదీ ఫైర్

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని రాజకీయాలా?.. మోడీపై దీదీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ పాటించకపోవడం మరియు 'అంతర్జాతీయ సంతాల్ సమ్మేళనం' వేదికను అకస్మాత్తుగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. "రాష్ట్రపతి పట్ల బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అవమానకరం. ప్రజాస్వామ్యాన్ని, గిరిజన సాధికారతను నమ్మే ప్రతి ఒక్కరూ ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. స్వయంగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన ఆవేదన భారతీయులందరినీ కలిచివేసింది" అని ప్రధాని పేర్కొన్నారు.

మోడీపై దీదీ ఫైర్..

తాజాగా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మోడీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతిని అడ్డంపెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయాలు సరికాదని అన్నారు.

Next Story