- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వర్ణదేవాలయంలో ఆయుదాలకు అనుమతి..కారణం ఇదే
ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో పవిత్ర స్వర్ణదేవాలయంలోకి సైతం ఆయుధాలకు అనుమతిచ్చారు. ఈ విషయాన్ని వైమానికదళ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సమర్ ఇవాన్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో పవిత్ర స్వర్ణదేవాలయంలోకి సైతం ఆయుధాలకు అనుమతిచ్చారు. ఈ విషయాన్ని వైమానికదళ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సమర్ ఇవాన్ వెల్లడించారు. దేశంలో అంతర్గత కలహాలు సృష్టించడానికి పాకిస్థాన్ స్వర్ణదేవాలయాన్నే టార్గెట్ చేసిందని చెప్పారు. పాక్ దేవాలయాలపై దాడులు చేస్తుందని ముందగానే ఊహించామని అన్నారు. తాము భావించినట్టే పాక్ స్వర్ణదేవాలయంపై దాడి చేయబోతుందని నిఘా వర్గాలు వెల్లడించాయని చెప్పారు.
అందుకే గోల్డెన్ టెంపుల్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆలయంపై దాడికి కుట్ర జరుగుతుందని చెప్పిన వెంటనే ఆలయ పెద్దలు తమకు సహకరించారని అన్నారు. ఆలయ ప్రధాన ప్రదేశాల్లో తుపాకులతో పోలీసులు మోహరించడానికి పర్మిషన్ ఇచ్చారన్నారు. అదేవిధంగా మిస్సైల్స్ ప్రమాదం జరగకుండా ఆలయంలోని లైట్లను ఆపివేశారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వెలుగుతున్న లైట్లను ఆర్పివేయడం ఇదే మొదటిసారి కావచ్చని, అందరికీ చీఫ్ లెఫ్టినెంట్ కృతజ్ఞతలు తెలిపారు.






