IMD :మూడు రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

by Hajipasha |
IMD :మూడు రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి హాట్ సమ్మర్‌ను చవిచూసిన జమ్మూకశ్మీర్‌లో సోమవారం భారీ వర్షపాతం నమోదైంది. ఆ రాష్ట్రంలో ఆగస్టు 2 వరకు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. మరోవైపు గుజరాత్‌లోనూ సోమవారం వర్షాలు కురిశాయి.

మరో 24 గంటల పాటు అక్కడ వానలు పడొచ్చని ఐఎండీ పేర్కొంది. కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాజస్థాన్‌కు జులై 31న, మధ్య మహారాష్ట్ర ప్రాంతానికి ఆగస్టు 1, 2 తేదీల్లో, కోస్తా కర్ణాటక ప్రాంతానికి జులై 30న ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అరుణాచల్ ప్రదేశ్‌కు ఆగస్టు 1, 2 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.



Next Story