IMD: మే నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు:ఐఎండీ

by S Gopi |

వర్షాలు గత సంవత్సరం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాకుండా అడ్డుకోవచ్చని బుధవారం ప్రకటనలో వెల్లడించింది.

IMD: మే నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు:ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మే నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గత సంవత్సరం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాకుండా అడ్డుకోవచ్చని బుధవారం ప్రకటనలో వెల్లడించింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాలలో వేడిగాలులు సాధారణం కంటే ఒకటి నుంచి నాలుగు రోజులు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మే నెలలో ఒకటి నుంచి మూడు రోజుల వరకు వేడిగాలులు నమోదవుతాయి. ఈసారి కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా చోట్ల సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మహాపాత్ర అన్నారు. ఉత్తర భారతంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని, దీర్ఘకాలిక సగటు 64.1 మి.మీ.లో 109 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. మే నెలలో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు గతేడాదిలో ఉన్న స్థాయి నుంచి పెరగకుండా వాతావరణాన్ని చల్లబరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

Next Story