మేము కుంగిపోము.. కేంద్రంపై మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఫైర్‌

by Ramesh Naini |

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్‌ మరోసారి మండిపడ్డారు.

మేము కుంగిపోము.. కేంద్రంపై మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఫైర్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్‌ మరోసారి మండిపడ్డారు. తమిళనాడు నుంచి కేంద్రానికి భారీ రెవెన్యూ వెళ్తున్నప్పటికీ, రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌లో స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎద్దేవా చేశారు. తమిళనాడు ప్రజల హక్కులను పదే పదే లేఖల ద్వారా, ప్రత్యక్షంగా అభ్యర్థనలు ద్వారా, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాల ద్వారా తెలియజేసినా.. కేంద్రం స్పందించకపోవడం అన్యాయమన్నారు.

దేశంలోనే అత్యధిక పన్ను ఆదాయం అందిస్తున్న రాష్ట్రం తమిళనాడేనని, అలాంటి రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేయడం ఎవరూ అంగీకరించరని స్టాలిన్ వ్యాఖ్యానించారు. అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ తమిళనాడు 11.19% ఆర్థిక వృద్ధిని సాధించిందని, ‘మేము కుంగిపోము.. నిలబడి గర్వంగా నడుస్తాము’ స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తమిళనాడు ప్రజల ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్వీట్ ఇదే..

Next Story