- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం! వీడియో సందేశం ద్వారా స్పష్టత ఇచ్చిన ప్రధాని మోడీ
131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ కీలక వీడియో సందేశం! దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను, మహిళా సాధికారతను కాపాడటమే తమ లక్ష్యమని, విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో, విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చారిత్రక సంస్కరణను అడ్డుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలులో ఈ సవరణ ఒక కీలక ముందడుగు అని, దీనిని అడ్డుకోవడం అంటే దేశంలోని ‘నారీ శక్తి’ పురోగతిని ఆపడమేనని ఆయన విమర్శించారు. అధికారం కోసం విపక్షాలు చేస్తున్న ఇటువంటి రాజకీయాలు దేశ భవిష్యత్తుకు తీరని నష్టం కలిగిస్తాయని పీఎం హెచ్చరించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రధాని మోడీ తాజా సందేశంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకుండా చూసేందుకే తమ ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించిందని వివరించారు. ఈ బిల్లు ద్వారా సీట్ల సంఖ్యను పెంచి, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. విపక్షాలు అడ్డంకులు సృష్టించినప్పటికీ, ప్రతి ప్రాంతానికి మరియు ప్రతి వర్గానికి న్యాయం జరిగే వరకు తమ ప్రభుత్వం విశ్రమించదని ప్రధాని మోదీ తన వీడియోలో దృఢంగా ప్రకటించారు.






