ఐటీబీపీ జవాన్ల ధైర్య సాహసాలను మరువలేం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

by Kema Shiva Kumar |

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBT) జవాన్ల ధైర్య సాహసాలు మరువలేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

ఐటీబీపీ జవాన్ల ధైర్య సాహసాలను మరువలేం.. కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBT) జవాన్ల ధైర్య సాహసాలు మరువలేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ ఆహ్వానం ఇటానగర్‌కు వెళ్లిన బండి సంజయ్ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముందుగా ఆయన ఫెమా ఖండూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పపుంపుర జిల్లాలోని యుపియా గ్రామంలో ఉన్న ఐటీబీపీ 31వ బటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. తొలుత అమరవీరుల ఘాట్ వద్ద పూలమాల వేసి వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐటీబీపీ సిబ్బంది కేంద్ర మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఆ వెంటనే 31వ బటాలియన్ ఐటీబీపీకి సంబంధించి కొత్తగా నిర్మించిన ఏఎస్ఐ మెస్ (భవనం-45), Animal Training School వద్ద లోహిత్‌పూర్‌లో అధికారులు, సబ్‌ఆర్డినేట్ అధికారుల నివాస సముదాయం, పరిపాలనా భవనం, అధికారుల మెస్, 10 పడకల ఆసుపత్రి బసార్‌లో 49వ బెటాలియన్ ఏఎస్‌ఐ మెస్, నివాస సముదాయాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే జవాన్లకు గౌరవ మర్యాదలతో పాటు సౌకర్యాలతో జీవించేలా చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందని అన్నారు. దేశ భద్రతకు ఆత్మ అయిన ఐటీబీపీ ధైర్యవంతులైన హిమవీరుల మధ్య నిలబడటం గర్వంగా ఉందని అన్నారు.

ఐటీబీటీ మహత్తర దళానికి చెందిన అమర వీరులకు బండి సంజయ్ వందనాలని అన్నారు. దేశం కోసం విలువైన ప్రాణాలను త్యాగం చేసిన యోధుల పేర్లు ప్రతి పౌరుడికి తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. కానీ వారి ధైర్యం, త్యాగం భారత ప్రజల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయని అన్నారు. ‘భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ ఒక సాధారణ దళం కాదని.. అక్కడ ఆక్సిజన్ అరుదు, ఉష్ణోగ్రతలు మైనస్‌లో ఉంటాయని గుర్తు చేశారు. సైనికులు రక్షించేది కేవలం భూమిని మాత్రమే కాదని.. దేవ సార్వభౌమాధికారాన్ని కూడా అంటూ కితాబిచ్చారు. దేశాన్ని కాపాడే సైనికులు గౌరవ మర్యాదలతో పాటు సౌకర్యాలతో జీవించేలా చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సాయుధ పోలీస్ దళాల ఆధునీకరణ, మౌలిక వసతుల బలోపేతం, జీవన ప్రమాణాల పెంపు, వృత్తి పురోగతి భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ హోంమంత్రి మమా నటుంగ్, డీజీపీ ఆనంద్ మోహన్, డిప్యూటీ కమిషనర్ విశాఖ యాదవ్, స్థానిక మేయర్ తమ్మె పసింగ్, చీఫ్ ఇంజనీర్లు భట్టాచార్య, ముఖేష్ కుమార్, ఈఈలు రాజేశ్ దవే, సరస్వతి కొన్వార్ హాజరయ్యారు.

Next Story