JP Nadda: ఈ ఏడాది చివరి నాటికి దేశం నుండి టీబీని ఎలిమినేట్ చేస్తాం: జేపీ నడ్డా

by Prasad Jukanti |   (  Updated:2025-02-28 11:12:31  IST  )

క్యాన్సర్ రోగుల కోసం ప్రతి జిల్లాల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటుకు కేంద్రం సిద్ధం అవుతున్నది.

JP Nadda: ఈ ఏడాది చివరి నాటికి దేశం నుండి టీబీని ఎలిమినేట్ చేస్తాం: జేపీ నడ్డా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది చివరి నాటికి భారతదేశం నుండి క్షయవ్యాధిని (TB) నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపి నడ్డా (JP Nadda) అన్నారు. 2030 నాటికి ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించే క్షయవ్యాధిని అంతం చేస్తానని ప్రపంచం ప్రతిజ్ఞ చేసినా ఈ విషయంలో పనులు జరుగుతున్న తీరు అద్భుతంగా ఉందని ఈ ఏడాది నాటికి దేశంలో క్షయవ్యాధిని అంతమొందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒడిశాలోని పూరీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 2017లో ప్రభుత్వం కొత్త ఆరోగ్య విధానాన్ని తీసుకువచ్చిన తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయని నడ్డా అన్నారు. ప్రసూతి మరణాల రేటు, గ్లోబల్ మరణాల రేటు రెండింతలు తగ్గిందని మలేరియా చాలా వరకు నిర్మూలించగలిగామన్నారు.

క్యాన్సర్ డే కేర్ సెంటర్లు:

దేశంలోని ప్రతి జిల్లాలో కేన్సర్‌ రోగుల కోసం డేకేర్‌ సెంటర్‌లను (Cancer Day Care Centers) ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని జేపీ నడ్డా చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే 30 రోజుల్లోగా చికిత్స అందించవచ్చని మంత్రి తెలిపారు. భారతదేశ జనాభాలో 90 శాతం మంది ‘ఆయుష్మాన్ భారత్’ యోజన ప్రయోజనాలను పొందుతున్నారని, మెరుగైన ఆరోగ్య సేవల కోసం దేశ ఆరోగ్య రంగానికి బలమైన మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. తన మంత్రిత్వ శాఖ దానిపై పనిచేస్తోందని తెలిపారు.

Next Story