సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తాం.. పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

జమ్మూకశ్మీర్‌‌ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam)లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇప్పటికే పాకిస్థాన్‌ (Pakistan)కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.

సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తాం.. పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌‌ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam)లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇప్పటికే పాకిస్థాన్‌ (Pakistan)కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత్‌ (India)లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసంది. అదేవిధంగా పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధూ నదీ జలాల (Indus River Water) ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరుకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ (Defense Minister Khawaja Asif) ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సింధూ జలాలను మళ్లించేందుకు భారత్‌ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు. ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.

Next Story