- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాకు చెందిన మరో ఎఫ్-35ని చూల్చేశాం.. ఇరాన్ సంచలన స్టేట్‌మెంట్
ఇరాన్ రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గత 5 వారాలుగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఆపరేషన్ చేపడుతున్న అగ్రదేశం అమెరికాకు ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో ఉద్రిక్తత వేళ ఇరాన్ (Iran) సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఎఫ్-35 (F-35) స్టెల్త్ ఫైటర్ జెట్‌ను తమ సైన్యం కూల్చివేసినట్లుగా తెలిపింది. సెంట్రల్ ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా (America) ఫైటర్ జెట్‌ను ఇరాన్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుని కూల్చేశాయని ఇరాన్ వార్తా సంస్థ ‘మెహర్’వెల్లడించింది. విమానం కూలిపోయిన తీరును బట్టి అందులోని పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్ అధికారులు భావిస్తున్నారు. యుద్ధ విమానాన్ని కూల్చడమే కాకుండా, ఇరాన్ తన రివల్యూషనరీ గార్డ్స్ ద్వారా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, పైలాట్ నౌకాశ్రయాలపై సుదూర శ్రేణి క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గత ఐదు వారాలుగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ఎదురుదాడికి దిగడం గమనార్హం.
ఎఫ్-35 స్పెషాలిటీ ఏంటి..?
అమెరికా రక్షణ వ్యవస్థలో ఎఫ్-35 అత్యంత శక్తివంతమైనది. దీనిని రాడార్లు గుర్తించడం అసాధ్యమని (Stealth) భావిస్తారు. అలాంటి అన్‌బీటబుల్ విమానాన్ని ఇరాన్ కూల్చివేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే, ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ధృవీకరించాల్సి ఉండగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.






