అమెరికా సర్కారులో కీలక పరిణామం.. అటార్నీ జనరల్ పదవికి పామ్ బాండీ రాజీనామా

by Kema Shiva Kumar |

అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అమెరికా సర్కారులో కీలక పరిణామం.. అటార్నీ జనరల్ పదవికి పామ్ బాండీ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ (Pam Bondi) తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా సమాచారాన్ని తెలియజేశారు. పామ్ బాండీ స్థానంలో ప్రస్తుత డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె (Todd Blanche) తాత్కాలిక అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపడతారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పామ్ బాండీ సేవలను కొనియాడుతూ.. ఆమె గొప్ప దేశభక్తురాలు, నమ్మకమైన స్నేహితురాలు అంటూ కితాబిచ్చారు. గత ఏడాది కాలంగా అటార్నీ జనరల్‌గా ఆమె ఎంతో నిబద్ధతతో పనిచేశారని తెలిపారు.. త్వరలోనే ఆమె ప్రైవేట్ రంగంలో ఓ కీలక బాధ్యతను చేపట్టబోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే, బాండీని ట్రంప్ పదవి నుంచి తొలగించారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన కొద్దిసేపటికే ఈ ప్రకటన రావడం గమనార్హం. గతంలో ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదిగా పనిచేసిన టాడ్ బ్లాంచె ఇప్పుడు న్యాయశాఖ తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనుండటంతో పొలిటికల్‌గా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story