Wayanad: వయనాడ్ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలి.. అమిత్ షాతో కేరళ ఎంపీల భేటీ

by vinod kumar |   ( Updated:2024-12-04 16:14:46.0  )
Wayanad: వయనాడ్ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలి.. అమిత్ షాతో కేరళ ఎంపీల భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ (Wayanad) పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నేతృత్వంలోని కేరళ ఎంపీల బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) కు విజ్ఞప్తి చేసింది. ఎంపీలందరూ పార్లమెంట్ హౌస్‌లో అమిత్ షాతో బుధవారం భేటీ అయ్యారు. కొండచరియలు విరిగిపడిన బాధితులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రాజకీయ విభేదాల కంటే మానవీయ సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మౌలిక సదుపాయాలను పునర్:నిర్మించడానికి సహాయం అందించాలని తెలిపారు. సమావేశం అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు. ‘విపత్తు వల్ల అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. చాలా కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి. హెల్ప్ చేయడంలో జాప్యం జరిగితే బాధితులకు ప్రతికూల సందేశం వెళ్తుంది’ అని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్ఫదంతో సంక్షోభాన్ని పరిష్కరించాలని సూచించారు. సహాయక చర్యలపై గురువారం సాయంత్రంలోగా వివరాలు అందజేస్తానని అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జూలై 30న కేరళ(Kerala)లోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 231 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed