- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: కంటెంట్ క్రియేటర్లకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్.. వేవ్స్ సమ్మింట్ లో కీలక పిలుపు
వేవ్స్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ భారతీయ యువతకు కీలక పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మారుతున్నదని సంప్రదాయ, నవతారాలను సమన్వయం చేసుకుంటూ 21 వ శతాబ్దంలో కొత్త అవకాశాలను భారతీయ యువత అందిపుచ్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. భారత్ లో వేల ఏళ్ల నాటి కథల ఖజానా ఉందని వాటిలో కల్పన, చరిత్ర, సైన్స్ అన్ని ఇమిడి ఉన్నాయన్నారు. మన దేశ యువత ఈ అన్ టోల్డ్ స్టోరీలన్నీ ప్రపంచానికి తెలియజెప్పాలన్నారు. ముంబయి వేదికగా ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్ టైన్ మెంట్ (వేవ్స్-2025) సమ్మిట్ ను (Waves Summit 2025) ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారత్ లో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయని ఒక్కో ఊరికీ ఒక్కో కథ ఉందని మన దేశంలో ప్రతి వీధి ఒక కథ చెబుతుంది, ప్రతి పర్వతం ఒక పాట పాడుతుంది, ప్రతి నదీఒక గేయం ఆలపిస్తుందన్నారు. భారత్ అనేక విభిన్న సమాజాల సమాహారం అని అన్నారు.
త్వరలో వేవ్ అవార్డ్స్:
త్వరలో వేవ్స్ అవార్డులు (Waves Awards) ఇవ్వబోతున్నామని ఈ వేవ్స్ అవార్డులు ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయని ప్రధాని చెప్పారు. క్రియేటివిటీ ఉన్న యువత దేశానికి అసలైన ఆస్తి అన్నారు. కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశంలో ఇలాంటి సదస్సు ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి అన్నారు. గేమింగ్ రంగంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రతిభ, సృజనాత్మకతల ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పుడు భారత్ అన్ని విషయాల్లో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతున్నదని చెప్పారు.
హాజరైన ప్రముఖులు:
అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. మే 1 నుంచి 4వ తేదీ వరకు ముంబయి వేదికగా అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. భారతీయ చిత్రాలగురించి మాత్రమే కాకుండా ఓటీటీలు, కామిక్స్, డిజిటల్ మీడియా, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ వంటి పరిశ్రమలకు సంబంధించిన పలు అంశాలపై ఈ వేదికపై చర్చించనున్నారు. దాదాపు 90 కి పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు క్రియేటర్స్, కంపెనీల ప్రతినిధులు, హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.






