- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China's humanoid robots: చైనాలో హ్యూమన్స్ వర్సెస్ హ్యుమనాయిడ్స్
చైనా కాలం కంటే వేగంగా పరుగులు పెడుతోంది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో చైనా తన ఆధిపత్యాన్ని సాధించాలని చూస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: చైనా కాలం కంటే వేగంగా పరుగులు పెడుతోంది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో చైనా తన ఆధిపత్యాన్ని సాధించాలని చూస్తోంది. అందుకుతగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. సినిమాల్లో చూసేలా మారథాన్ లో మనుషులతో రోబోలు పోటీ పడేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చైనా (China)లో జరిగిన హాఫ్- మారథాన్‌లో ఈ రోబో (humanoid robots)లను మనం చూడొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన 69వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈక్రమంలో బీజింగ్‌లో యిజువాంగ్ హాఫ్- మారథాన్‌ను నిర్వహించారు. ఈ మారథాన్‌లో 21 కిలోమీటర్లు పరుగులు పెట్టేందుకు వేలాదిమంది రన్నర్లతో పాటు 21 రోబోలు కూడా పోటీపడ్డాయి. ఈ పోటీకి కొన్ని వారాల ముందే వీటిని పరీక్షించి మరీ బరిలోకి దింపినట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. డ్రాగన్ దేశంలో గతంలో జరిగిన అనేక మారథాన్‌లలో రోబోలు కనిపించాయి. అయితే, మనుషులతో కలిసి పోటీపడటం మాత్రం ఇదే తొలిసారి.
నియమాలు
రోబో రేసును న్యాయంగా, సురక్షితంగా ఏర్పుట చేసేందుకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. హ్యూమనాయిడ్‌లు, బైపెడల్ తో 0.5 నుంచి 2 మీటర్ల ఎత్తు ఉన్న రోబోలు మాత్రమే ఈ పోటీలో పాల్గొనగలవు. వీల్స్ లేదా రెండు కంటే ఎక్కువగా కాళ్లు ఉంటే ఆ రోబోలను పోటీకి అనుమతించారు. గంటల తరబడి సిమ్యులేషన్‌తో రోబోలను వాటి పరిమితులకు మించి నడిపిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రేసు సమయంలో జట్లు బ్యాటరీలు లేదా రోబోలను భర్తీ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. కానీ ప్రతి భర్తీకి 10 నిమిషాల జరిమానా విధించనున్నారు. రిమోట్-కంట్రోల్డ్ సహా అటానమస్ రోబోలు రెండింటిని అనుమతించారు. కానీ, అవి ఈవెంట్ సమయంలో సురక్షితంగా నడపాల్సి ఉంటుంది. రేసుకు 3.5 గంటల కఠినమైన సమయ పరిమితి ఉంది. టైం పెనాల్టీ ఆధారంగా రోబోల విజేతలను ప్రకటిస్తారు. మొదటి విజేతకు 690 డాలర్లు, రెండో విజేతకు 560 డాలర్లు, మూడో విజేతకు 420 డాలర్ల బహుమతి కలదు.






