- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral: వారి నిర్లక్ష్యమే హాంకాంగ్ భారీ అగ్ని ప్రమాదానికి కారణమా? వైరల్
హాంకాంగ్ లో ఎత్తైన 8 టవర్లలో బుధవారం (నవంబర్ 26) జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 128 కి పెరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హాంకాంగ్‌లో ఎత్తైన 8 టవర్లలో బుధవారం (నవంబర్ 26) జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 128 కి పెరిగింది. ప్రమాదంలో దాదాపు 76 మందికి పైగా గాయపడ్డారు. 270 మంది ఆచూకీ లభించలేదు. ఈ ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ, అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో అగ్ని ప్రమాదానికి కారణం వారేనని ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రమాదానికి రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను రిపేరు చేస్తున్న వర్కర్ల నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఓ వర్కర్ స్మోకింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుండగా, వారి నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
అలాగే ఎనిమిది బ్లాక్‌లలోని అగ్నిమాపక అలారాలు సమర్థవంతంగా పనిచేయడం లేదని అగ్నిమాపక శాఖ గుర్తించింది. కొన్ని మోగలేదని నివాసితుల నుండి వచ్చిన నివేదికల తర్వాత నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం ఏర్పాటు చేయడానికి పథకాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, బుధవారం (Wang Fuk Court) వాంగ్ ఫక్ కోర్టులో ఒక ఎత్తైన భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. తర్వాత ఏడు భవనాలకు వ్యాపించింది. ఒక్కొక్కటి 31 అంతస్తుల బిల్డింగ్.. 2021 ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం.. ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 4,600 మంది నివాసితులకు 1,984 అపార్ట్‌మెంట్‌లు ఉన్నట్లు తెలిసింది. వీడియో ఇదే..






