రిలేషన్ షిప్ పై పోస్టు.. మరోసారి వార్తల్లో నిలిచిన తేజ్ ప్రతాప్

by Shamantha N |

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap Yadav) చేసిన పోస్టు వైరల్ గా మరింది.

రిలేషన్ షిప్ పై పోస్టు.. మరోసారి వార్తల్లో నిలిచిన తేజ్ ప్రతాప్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap Yadav) చేసిన పోస్టు వైరల్ గా మరింది. రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ సోషల్ మీడియలో పెట్టిన పోస్టు వైరల్ గా మారడంతో.. ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, ఈ పోస్టుపై ఆయన స్పందిస్తూ.. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్‌ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం చేశారు. శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్‌ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైనే ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన సోషల్‌ మీడియాను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు. మరోవైపు, తేజ్‌ ప్రతాప్‌ 2018లో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్‌ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, కొన్ని నెలల్లోనే ఐశ్వర్య తన భర్త, అత్తమామలు తనను వెళ్లగొట్టారని ఆరోపిస్తూ తేజ్ ప్రతాప్ ఇంటిని విడిచిపెట్టారు. ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు, హ్యాకింగ్ పై తేజ్ ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Next Story