- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంటలు కనిపిస్తే బొక్కలు ఇరగ్గొడుతం.. లవర్స్ డే రోజు ప్రేమికులకు వార్నింగ్
యూపీలోని ముజఫర్ నగర్‌లో ప్రేమికుల దినోత్సవం జరుపుకోవద్దు అంటూ కాంత్రి సేన అనే బృందం ప్రేమికులకు వార్నింగ్ ఇచ్చింది. ప్రేమ జంటలు బయటకు రావొద్దని వస్తే బొక్కలు విరగ్గొడతామని హెచ్చరించింది. అంతేకాకుండా వాలెంటైన్స్ వీక్ ప్రారంభంలోనే వీళ్లు లాఠీ పూజ కార్యక్రమం సైతం నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం వచ్చేసింది. ఇప్పటికే వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్‌లో జంటలు మునిగితేలుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే కొన్ని సంఘాలు జంటకు వార్నింగ్ ఇస్తున్నాయి. తాజాగా యూపీలోని ముజఫర్ నగర్‌లో ప్రేమికుల దినోత్సవం జరుపుకోవద్దు అంటూ కాంత్రి సేన అనే బృందం ప్రేమికులకు వార్నింగ్ ఇచ్చింది. ప్రేమ జంటలు బయటకు రావొద్దని వస్తే బొక్కలు విరగ్గొడతామని హెచ్చరించింది. అంతేకాకుండా వాలెంటైన్స్ వీక్ ప్రారంభంలోనే వీళ్లు లాఠీ పూజ కార్యక్రమం సైతం నిర్వహించారు.
ఈ సందర్భంగా లాఠీలకు బొట్టుపెట్టి పూజ చేశారు. రోజ్ డే, చాక్లెట్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే అలాంటి వేడుకలు జరుపుకుంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా క్రాంతి సేన మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పూనమ్ చౌదరి మీడియాతో మాట్లాడారు. ముజఫర్ నగర్ మార్కెట్ ప్రాంతంలోని హెటల్స్, రెస్టారెంట్ల యజామనులకు లిఖిత పూర్వంగా నోటీసులు పంపినట్టు తెలిపారు.
వాలెంటైన్స్ డే సంబంధిత కార్యక్రమాలను నిర్వహించవద్దని ఆదేశించినట్టు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో జంటలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయవచ్చు కదా అని సూచిస్తున్నారు. దేశంలో అవినీతి, నేరాలు ఘోరాలు లాంటి అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వదిలేసి ప్రేమికుల వెంట పడటం ఏంటని మండిపడుతున్నారు.






