- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
War: ఇరాన్‌పై అమెరికా యుద్ధ ప్రకటన..? నేటి నుంచే సముద్ర మార్గాల దిగ్బంధనం!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నేటి నుంచి ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించి బయటకు వెళ్లే అన్ని రకాల సముద్ర రవాణాను దిగ్బంధించాలని అమెరికా నిర్ణయించింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. ఇరాన్ (Iran)ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు అమెరికా (America) అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఇరాన్ ఓడ రేవుల్లోకి వచ్చి వెళ్లే అన్ని రకాల సముద్ర రవాణాను (Maritime Traffic) పూర్తిగా అడ్డుకోనున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని ఓడరేవులను అమెరికా నావికాదళం తన ఆధీనంలోకి తీసుకోనుంది. దీంతో ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు, ఇతర దేశాల నుంచి దిగుమతులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రాంతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్న ఇరాన్ చర్యలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అమెరికా ఈ ‘బ్లాకేడ్’ విధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజా నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఇక అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది. మరోవైపు చమురు దిగుమతుల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది ఆందోళన కలిగించే అంశం. సముద్ర మార్గాల దిగ్బంధనం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.






