- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waqf: వక్ఫ్ చట్టంపై తీర్పు రిజర్వ్.. సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదనలు గురువారం ముగిశాయి.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ చట్టం 2025 (Waqf amendment act) ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో (Supreme court) కొనసాగుతున్న వాదనలు గురువారం ముగిశాయి. సీజేఐ బీఆర్ గవాయ్ (Br gawai), న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మాసిహ్ నేతృత్వంలోని ధర్మాసనం వరుసగా మూడు రోజుల పాటు ఈ అంశంపై వాదనలు విన్నది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ (Kapil sibal), రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వి వాదించగా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Thushar mehatha) కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
ఈ చట్టం ముస్లింల హక్కులకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొంటూ మధ్యంతర స్టే ఇవ్వాలని కోరగా.. కేంద్ర ప్రభుత్వం చట్టానికి అనుకూలంగా వాదనలు వినిపించింది. అయితే ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే చట్టంలోని మూడు అంశాలపై పిటిషనర్లు మధ్యంతర స్టే ఇవ్వాలని కోరగా అందుకు కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.






