Waqf law: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ మే 15కి వాయిదా

by Shamantha N |

పహెల్గాం (Pahalgam) ఉగ్రదాడి విషయంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై పశ్చిమబెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతా బెనర్జీ (Mamata Banerjee) మండిపడ్డారు.

Waqf law: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ మే 15కి వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్‌ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మే 15కి కేసుని వాయిదా వేసింది. కాగా.. ఈ పిటిషన్ ను జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వక్ఫ్‌ చట్టం రాజ్యాంగ చెల్లుబాటు సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 70 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే కేసును సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఏప్రిల్‌ 17న సీజేఐ జస్టిస్‌ సంజీవ్ కన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. కాగా.. కేంద్రప్రభుత్వం అభ్యర్థన మేరకు మే 5వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఈ కేసులపై విచారణ చేపట్టిన సమయంలో.. వక్ఫ్ చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం హామీ ఇచ్చింది. వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అలాగే, వక్ఫ్‌ కౌన్సిల్‌, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తుషార్ మెహతా వాదనలు..

కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే వక్ఫ్‌ చట్టంలో సవరణ చేసినట్లు కోర్టుకు తెలిపారు. పూర్తిస్థాయిలో వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరణతో కూడిన వివరాలు తెలిపేందుకు కోర్టును గడువు కోరారు. ఈ మేరకు కేంద్రం వారం రోజులు గడువు ఇస్తూ కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్‌ జాబితా నుంచి తొలగించొద్దని.. వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ మండలిలో ఎక్స్‌-అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Next Story