- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waqf Bill: వక్ఫ్ బిల్లుకు లైన్ క్లియర్.. రాజ్యసభలోనూ ఆమోదం
పార్లమెంటు వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 (Parliament Waqf (Amendment) Bill-2025) ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంటు వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 (Parliament Waqf (Amendment) Bill-2025) ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. రాజ్యసభ (Rajya Sabha) గురువారం అర్థరాత్రి ఎగువ సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. సభలో ఓటింగ్ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటు వేయగా, 95 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే, బిల్లుపై రాజ్యసభ దాదాపు 12 గంటల పాటు సుధీర్ఘగా చర్చ కొనసాగింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) వక్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను కొట్టిపడేశారు. వక్ఫ్ బోర్డు నిర్వహణ, సృష్టి, లబ్ధిదారులు అంతా ముస్లింలే ఉంటారని, ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం ఉండదన్నారు. ఈ బిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తుల నిర్వహణకు సంబంధించినదని, అవినీతిని నిర్మూలించడమే బిల్లును తీసుకొచ్చామని అన్నారు.
అయితే, వక్ఫ్ సవరణ బిల్లు-2025 వక్ఫ్ ఆస్తుల నిర్వహణను క్రమబద్ధీకరించడం లక్ష్యం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వారసత్వ ప్రదేశాలను కాపాడేందుకు, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) ఈ వక్ఫ్ చట్టంలో సవరణలు చేసింది. ఆస్తి నిర్వహణలో పారదర్శకత, వక్ఫ్ బోర్డులు, స్థానిక అధికారుల మధ్య సమన్వయం క్రమబద్ధీకరణ, వాటాదారుల హక్కుల రక్షణ ఈ చట్టం లక్ష్యం. ముస్లిం మహిళలు, ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల ఆర్థిక, సామాజిక స్థితిని మెరుగుపర్చడం, మెరుగైన వక్ఫ్ పాలన వివిధ ముస్లిం వర్గాల నుంచి ప్రాతినిధ్యం, వక్ఫ్ బోర్డును కలుపుకొనిపోయేలా చేయడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. వక్ఫ్ (సవరణ) బిల్లు వక్ఫ్ పరిపాలన కోసం లౌకిక, పారదర్శక ,జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ బిల్లు భారతదేశంలో వక్ఫ్ పరిపాలన కోసం ప్రగతిశీల,న్యాయమైన చట్రాన్ని నిర్దేశిస్తుంది.
కాగా, వక్ఫ్ సవరణ బిల్లు-2025 లోక్‌సభ (Lok Sabha)లోనూ ఆమోదం పొందింది. సభలో ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా.. 232 మంది వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 12 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం అర్ధరాత్రి లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు రాష్ట్రపతికి వద్దకు వెళ్లి చట్టంగా మారనుంది.






