- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waqf bill: వక్ఫ్ పిటిషన్లపై ఈ నెల15న సుప్రీంకోర్టులో విచారణ !
వక్ఫ్ సవరణ చట్టం మంగళవారం నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ చట్టం (Waqf act) మంగళవారం నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలపగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu) సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇది చట్టంగా మారింది. అయితే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme court) లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లంటినీ అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 15న విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఈ విషయం ప్రస్తావించలేదు. అంతకుముందు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లంటినీ విచారిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేసే ముందు తమను విచారించాలని తెలిపింది.
కాగా, వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB), జమియత్ ఉలామా-ఇ-హింద్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, మహ్మద్ జావేద్, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ ఎంపీలు మనోజ్ ఝా, ఫయాజ్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సహా పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.






