- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ
మోడీ ప్రభుత్వం విద్య, పౌర హక్కు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ అన్ని విధాలుగా దేశాన్ని అగాధంలోకి తోసేస్తోంది

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ గురువారం వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగంపై 'దాడి' అని అభివర్ణించారు. దీని ద్వారా సమాజాన్ని శాశ్వతంగా విభజించేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శలు చేశారు. గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడిగా భావిస్తున్నాం. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం లేదా ఎన్నికల నిర్వహణ ఇలా అన్ని విధాలుగా దేశాన్ని అగాధంలోకి తోసేస్తోంది. రాజ్యాంగం కేవలం కాగితాలకే పరిమితమైంది. దీన్ని కూడా ధ్వంసం చేయాలనేదే వారి ఉద్దేశమని తెలుసు. మోడీ ప్రభుత్వ ఉద్దేశాలను బయటపెట్టాలని, న్యాయసమ్మతమైనదాన్ని ప్రజలకు తెలియజేయాలని, దానికోసం అందరూ కలిసి పోరాడాలని ఎంపీలతో అన్నారు. ఇదే సమయంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును కూడా తీసుకొస్తున్నారని, దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
పార్లమెంటు ఉభయ సభల పనితీరుపై ఆమె మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలను మాట్లాడనివ్వడం లేదని, కాంగ్రెస్ తమ సమస్యలను లేవనెత్తడానికి అనుమతించకుండా తరచుగా గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ సభ్యులు టార్గెట్ చేస్తున్నాయని, వారి వైఫల్యాలను సభ ముందు ఉంచేందుకు కాంగ్రెస్ ఎంపీలు అంతే ధీటుగా పనిచేయాలని సోనియా గాంధీ సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గెతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.






