Waqf act: వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం.. ఎంఐఎం ఛీప్ అసదుద్దీన్ ఓవైసీ

by B.Srinivas |

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు.

Waqf act: వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం.. ఎంఐఎం ఛీప్ అసదుద్దీన్ ఓవైసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ చట్టం (Waqf act) రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అభివర్ణించారు. వక్ఫ్ ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించారని విమర్శించారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. వక్ప్ విషయంలో సుప్రీంకోర్టు (Supreme court) లో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వక్ఫ్ చట్టాన్ని ప్రశంసించే వారు చట్టంలోని ఏ సెక్షన్ మంచిని చూపుతుందో చెప్పాలని సవాల్ విసిరారు. వక్ప్ ఆదాయం పెరగడానికి, దాని ఆక్రమణ దారులను పట్టుకోవడానికి ఏ నిబంధన ఉందో చెప్పాలన్నారు.

వక్ఫ్‌ను నాశనం చేయడానికే కొత్త చట్టాన్ని రూపొందించారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా వక్ప్ చట్టం ఉంది కాబట్టే అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదంతో ఈ చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story