కుక్కను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఇరుగు పొరుగు వారి పర్మిషన్ తప్పనిసరి!

by Yella Dhawani Reddy |

మనలో చాలామందికి జంతువులంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఇంట్లో భాగంగా భావిస్తూ, ప్రేమతో పెంచుకుంటూ ఉంటారు.

కుక్కను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఇరుగు పొరుగు వారి పర్మిషన్ తప్పనిసరి!
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలామందికి జంతువులంటే (Animals) ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను (Pets) ఇంట్లో భాగంగా భావిస్తూ, ప్రేమతో పెంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కుక్కలను ఇంట్లో పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకూ ప్రతీ ఒక్కరూ వివిధ రకాల శునకాలను తమ ఇంటికి తీసుకువస్తున్నారు. కొందరికి ఇవి స్టేటస్ సింబల్ అయితే, మరికొందరికి తమ రక్షణ కోసం పెంచుకుంటున్నారు.

అయితే పెంపుడు జంతువులపై ఈ ఆసక్తికి తాజాగా గట్టి ఆంక్షలు ఎదురవుతున్నాయి. గుజరాత్‌ (Gujarat) రాష్ట్రంలోని సూరత్‌ (Surat) మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో శునకాన్ని పెంచుకోవాలంటే కనీసం పది మంది ఇరుగు పొరుగువారిచే ఇచ్చిన నిరభ్యంతర పత్రం (NOC) సమర్పించడం తప్పనిసరి అని కార్పొరేషన్ స్పష్టం చేసింది. అంతేకాదు, అపార్ట్‌మెంట్లలో శునకాలను పెంచాలంటే భవన సంక్షేమ సంఘం ఛైర్‌పర్సన్, కార్యదర్శుల అనుమతి అవసరమని స్పష్టం చేసింది.

ఇది శునకాల కారణంగా కలిగే అసౌకర్యాలను నివారించేందుకు తీసుకున్న చర్య అని అధికారులు తెలిపారు. మే నెలలో చోటు చేసుకున్న కుక్క దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాదకర ఘటన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

Next Story