- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tattoo: టాటూలు వేయించుకోవాలి అనుకుంటున్నారా? కర్ణాటక ప్రభుత్వం వార్నింగ్!
పచ్చబొట్టు (Tattoo) వేయించుకోవటం చాలా మంది ఇష్ట పడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: పచ్చబొట్టు (Tattoo) వేయించుకోవటం చాలా మంది ఇష్ట పడుతుంటారు. తమకు ఇష్టమైన వారి పేర్లు జ్ఞాపకంగా కొందరు వేయించుకుంటే, ఇంకొందరు ఇష్టమైన సింబల్స్‌ను టాటూలుగా వేయించుకుంటారు. మరికొందరు స్టైల్‌గా ఉండేందుకు అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు పచ్చబోట్లను వేయించుకుంటారు. అయితే, కొంత మంది ఒకటి, రెండు కాదు ఒంటి నిండా పచ్చబొట్లు వేయించుకుంటారు. అలాంటి వారికి ఈ వార్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టాటూలు వేయించుకునే వారికి కర్ణాటక ఆరోగ్య శాఖ కీలక వార్నింగ్ ఇచ్చింది.
ఇటీవల కాలంలో టాటూలు వేసుకోవటం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. దీంతో టాటూలు వేసేందుకు చాలా మంది ఆర్టిస్ట్‌లు, టాటూ స్టూడియోలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. అలాగే, రోడ్ల పక్కన, జాతర్లలో కూడా పచ్చబొట్లు వేసేవారు కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం పలు కీలక విషయాలను గుర్తించింది. పచ్చబొట్టు వేసేందుకు వినియోగిస్తున్న సిరాతో చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రహదారి పక్కన శుభ్రతను పాటించకుండా వేసే పచ్చబొట్లతో HIV, హెపటైటిస్ తదితర వ్యాధులు సోకుతున్నట్లు గుర్తించామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. బెంగళూరులోని ఆరోగ్య సౌధలో ఆయన వీడియాతో మాట్లాడుతూ.. నాసిరకం, రసాయనాలు కలిసిన పచ్చ ద్రావణం చర్మపొరలు, నరాల్లోకి వెళ్లి పలు రోగాలకు కారణమవుతోందన్నారు. ఇలాంటివాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ మేరకు ఆరోగ్య సురక్ష, ఔషధాల నాణ్యతను నిర్ధారించే నిపుణులు.. టాటూ సిరాలో కలిపే రింగర్ లాక్టెట్ ద్రావణానికి సంబంధించి 246 బ్యాచ్‌లను పరీక్షించినట్లు మంత్రి చెప్పారు. అందులో 113 నమూనాలు వినియోగానికి అర్హత లేనివని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే రింగర్ లాక్టేట్‌ను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్స్ సంస్థపై 9 కేసులు నమోదు కాగా, మరో 25 కేసుల నమోదుకు అనుమతించామని ఆయన వివరించారు. టాటూ ఇంక్‌లో కాంతివర్ధకాలు (ఇల్యూమినేట్/ మెరుపు) కలపకుండా కేంద్ర ప్రభుత్వం BIS ద్వారా నిబంధనలు కఠినతరం చేయాలని గుండూరావు కోరారు.






