Summer Vacations : వేసవిలో కూల్ కావాలనుకుంటున్నారా !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-03-04 06:32:00  IST  )

వేసవి ఎండల(Summer suns) తీవ్రతతో తల్లడిల్లుతున్న తెలుగు ప్రజలు..వీలైతే ఎక్కడైన చల్లచల్ల(Cool in Summer)గా కొన్నాళ్లు గడపాలన్న ఆలోచన సహజం.

Summer Vacations : వేసవిలో కూల్ కావాలనుకుంటున్నారా !
X

దిశ, వెబ్ డెస్క్ : వేసవి ఎండల(Summer suns) తీవ్రతతో తల్లడిల్లుతున్న తెలుగు ప్రజలు..వీలైతే ఎక్కడైన చల్లచల్ల(Cool in Summer)గా కొన్నాళ్లు గడపాలన్న ఆలోచన సహజం. అలాంటి వారి చూపు దేశంలోని హిమాలయ సరిహద్ధు రాష్ట్రాల వైపే ఉంటుంది. అంత దూరం వెళ్లి చిల్ అవ్వాలనుకోవడం భారమనుకునేవారికి సమీప దక్షిణాది రాష్ట్రాల(Southern states)లో కూడా సమ్మర్ వెకేషన్ కూల్ స్పాట్స్(Cool spots of summer vacation) అందుబాటులో ఉన్నాయన్న విషయం చల్లని కబురు వంటిదే.

కూల్ కూల్ గా ఉండే సౌత్ ఇండియన్ సమ్మర్ స్పాట్ లలో కుటుంబంతో సహా వేసవి విడిదికి వెళ్లి సేద తీరడంలో ఉన్న ఆనందం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. దక్షిణ భారత దేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో సమ్మర్ వెకేషన్ కూల్ ప్రాంతాలు సమ్మర్ వెకేషన్ కు వెళ్లే వారి కోసం ఎదురుచూస్తున్నాయి.

కొడైకెనాల్ : తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్ మంచి వేసవి విడిది. వేసవిలో మొదలయ్యే పర్యాటకుల హడావిడి జూలై వరకు కొనసాగుతోంది. కొడైకెనాల్ ను అడవులిచ్చిన కానుక అంటారు. ఈ సమయంలో ఇక్కడి ప్రకృతి అందాలు పరవశింపచేస్తాయి. పచ్చని అడవి మధ్య అక్కడ ఉంటే రాతి గుట్టలు, సెలయేటి ప్రవాహాలు, జలపాతాలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇక్కడ పలు ప్రఖ్యాత ఆలయాలు, మ్యూజియాలు, ఆలయాలు కూడా ఉన్నాయి. విశాలమైన చెరువులు, డెవిల్స్ కిచెన్, బేర్ షోలా ఫాల్స్ కొడై చెరువు, పిల్లర్ రాక్స్, కోకర్స్ వాక్, ధలైయర్ ఫాల్స్, బెరిజామ్ టేక్, కురుంజి ఆలయం తప్పక చూడాల్సినవే.

హన్ముడి హిల్స్ : కేరళలోని హన్ముడి హిల్స్ అడ్వెంచర్, ఆహ్లాదానికి, చల్లదనానికి వేదికగా నిలుస్తాయి. దీనిని ట్రెక్కర్స్ ప్యారడైజ్ అని కూడా పిలుస్తారు. ఎండలు మండే మే నెలలో దక్షిణ భారత దేశ పర్యాటకులకు అనువైన ప్రదేశం ఇది కొండ ప్రాంతమైన పొన్యుడి పట్టణం సుగంధ ద్రవ్యాల తోటలకు ప్రసిద్ధి. సుగంధ ద్రవ్యాల తర్వాత కాపీ తోటలు అధికంగా ఉంటాయి. గోల్డెన్ పెప్పరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు దీనికి సమీపంలో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ సఫారీ కోసం ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ జరిగే అరణ్మల ఆలయ ఉత్సవం ఎంతో ప్రసిద్ధి.

ఇడుక్కి : కేరళ లోని ఇడుక్కి ప్రాంతం జూలై వరకు పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. అతి పెద్దదైన ఆర్క్ డ్యామ్ ఇక్కడ ఉంది. ఇడుక్కి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వయినావు జలపాతం, తొమ్మనుకుంటు జలపాతం, ఇడుక్కి ఆర్చ్ డ్యామ్, కాఫీ తోటలు, గులాబీ తోటలు, కులమాపు డ్యామ్ ప్రాంతంలో చూడదగినవి. ఈ టూర్ మార్గాల్లో రబ్బరు తోటలు చూసిరావొచ్చు. ఎలిఫెంట్ రైడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కొండలపై ప్రయాణం మంచి అనుభూతినిస్తుంది.

అరకు వ్యాలీ : ఆంధ్రప్రదేశ్ లోని అరకు వ్యాలీ వేసవి వెకేషన్ కు చక్కని ప్రాంతం. కాఫీ లవర్స్ కు ఇది స్వర్గం. కాఫీ తోటలు, ఆ తోటల మధ్యదారులు, ఎత్తయిన కొండలు, దారి ప్రయాణంలో అక్కడక్కడా కనిపిస్తాయి. ఆదివాసీల గూడేలతో పాటు అరకు ఆర్ట్ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, కాపీ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, చాపరాయి వాటర్ ఫాల్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

గోకర్ణ : కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతం అందమైన బీచ్ లు అద్భుతమైన శిల్పాలతో ఉండే ఆలయాలకు నెలవు.గోవాలో ఉన్నట్లే ఈ చిన్న పట్టణానికి సమీపంలో చాలా బీచ్ లు ఉన్నాయి. రిలాక్స్ గా ఉండేందుకు ఇక్కడ అనువైన సౌకర్యాలున్నాయి. దగ్గరలోని మహాబలేశ్వరం సందర్శించవచ్చు. స్థానిక బీచ్ లో బోటింగ్ సదుపాయం ఉంది. సమీపంలోని కొండ ప్రాంతాలలో ట్రెక్కింగ్ చేయవచ్చు.

వట్టనకల్ : తమిళనాడులోని వట్టనకల్ ప్రాంతం దక్షిణ భారత దేశంలో వేడి ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా చల్లగా ఉంటుంది. వట్టనకల్ చూసి వస్తే ఇజ్రాయెల్ ని చూసినట్లే ఉంటుందట. అందుకే దీనిని ..లిటిల్ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా.. అని కూడా అంటారు. వట్టనకల్ షోల నర్సరీని కూడా చూసి రావచ్చు.

హిమాలయ కారిడార్ లో..

హిమాలయ సమీప రాష్ట్రలలో సమ్మర్ వెకేషన్స్ రిషికేష్, డార్జిలింగ్, లడఖ్, సిమ్లా, కసౌలి, మునాలి, నైనిటాల్ ప్రసిద్ధి నొందాయి. గోవా, ఊటీ కూడా చిల్ సెంటర్లుగా ఫేమస్.

Next Story