Supreme Court: ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారా? అసోం సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

by Shamantha N |   (  Updated:2025-02-04 13:24:35  IST  )

అసోం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీయులుగా ప్రకటించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించకుండా నిర్బంధ కేంద్రాల్లో నిరవధికంగా ఉంచడంపై మండిపడింది.

Supreme Court: ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారా? అసోం సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీయులుగా ప్రకటించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించకుండా నిర్బంధ కేంద్రాల్లో నిరవధికంగా ఉంచడంపై మండిపడింది. వారిని స్వస్థలాలకు పంపేందుకు ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారా అని అసోం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో నివసిస్తున్న 63 మందిని రెండు వారాల్లోగా వారి దేశాలకు తిరిగి పంపించాలని ఆదేశించింది. “దీనిపై ఆందోళన ఎందుకు? వారిని వారి దేశానికి తిరిగి పంపండి. రాజ్యాంగం(Constitution)లోని ఆర్టికల్ 21 ప్రకారం వారిని శాశ్వతంగా నిర్బంధ కేంద్రంలో ఉంచలేరు” అని వెల్లడించింది. అసోంలో విదేశీయుల కోసం అనేక నిర్బంధ కేంద్రాలు ఉన్నాయని.. అయితే, ఇప్పటి వరకూ ఎంత మందిని బహిష్కరించారని సుప్రీం కోర్టు అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మందిని రెండు వారాల్లోగా బహిష్కరించడం ప్రారంభించాలని సూచించింది. దీనికి సమ్మతిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని హిమంత ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

అసోం ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

వలసదారులు తమ విదేశీ చిరునామాలను వెల్లడించలేదని.. అందుకే బహిష్కరణ సాధ్యం కాదన్న అసోం వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిర్బంధంలో ఉన్నవారు విదేశీయులని నిర్ధారించిన వెంటనే వారిని దేశం నుండి బహిష్కరించాలని పేర్కొంది. వారి చిరునామాలు తెలియవంటూ, వారి బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించడానికి ఎందుకు నిరాకరించారని బెంచ్‌ ప్రశ్నించింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించిన వ్యక్తుల బహిష్కరణ, నిర్బంధ కేంద్రాల్లోని సౌకర్యాలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు అసోం సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.


Read Also..

ఖాతాలో డబ్బు లేకున్నా.. మనీ డ్రా!

Next Story