- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
W. Bengal Govt.: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
కోల్‌కతా (Kolkata)లోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ (Junior Doctor)పై జరిగిన హత్యాచార కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా (Kolkata)లోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ (Sanjay Roy) కి ఉరి శిక్షను విధించాలంటూ ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (West Bengal Government) తాజాగా సీల్దా కోర్టు (Sealdah Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, వారి పిటిషన్‌ను స్వీకరించిన రిజిస్ట్రీ త్వరలోనే విచారణ తేదీలను వెల్లడించనుంది. కాగా, కేసులో భాగంగా సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ అనిర్బన్ దాస్ (Justice Anirban Das), దోషి సంజయ్ రాయ్ (Sanjay Roy)కి జీవిత ఖైదును విధిస్తూ తుది తీర్పును వెలువరించారు. అదేవిధంగా రూ.50 వేల జరిమానా చెల్లించాలని తెలిపారు. ఇక బాధితురాలి తల్లిదండ్రులకు రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.






