- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vvpat: వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించాలని పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
వీవీ ప్యాట్ స్లిప్‌లను 100 శాతం మ్యానువల్‌గా లెక్కించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM)లతో పాటు వీవీ ప్యాట్ (VVPAT) స్లిప్‌లను 100 శాతం మ్యానువల్‌గా లెక్కించాలని, ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme court) తిరస్కరించింది. ఈ అంశంపై 2024 ఆగస్టు 12న ఢిల్లీ హైకోర్టు (Delhi High court) ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హన్స్ రాజ్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna), న్యాయమూర్తులు సంజయ్ కుమార్ (Sanjay kumar), కేవీ విశ్వనాథన్ (Vishwanathan) లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఒకే అంశాన్ని పదే పదే పరిశీలించబోమని, ఢిల్లీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని తెలిపింది. ఈ మేరకు హన్స్ రాజ్ పిటిషన్‌ను కొట్టి వేసింది.
తన నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఇలాంటి అంశాలను లేవనెత్తుతూ తీర్పు ఇచ్చిందని, దానిని పదే పదే లేవనెత్తలేమని సీజేఐ స్పష్టం చేశారు. ఓటర్లు తమ ఓటును ఖచ్చితంగా నమోదు చేసి లెక్కించేలా చూసుకోవడం వారి ప్రాథమిక హక్కు అని అయితే దీనిని 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించే హక్కుతో సమానం చేయలేమని తెలిపారు. వీటిని ఓటరు డ్రాప్ బాక్స్‌లో ఉంచడానికి అనుమతించాలని తెలిపారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పిటిషనర్ లేవనెత్తిన అంశం సమగ్రమైనది కాదని స్పష్టం చేశారు.
Read More..
Supreme Court: సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చడమేంటి?






