- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియాలో వింతైన పోలింగ్.. స్విమ్ సూట్‌లలో ఓటింగ్.. ‘డెమొక్రసీ సాసేజ్’ సంప్రదాయం
ఆస్ట్రేలియాలో వింతైన పోలింగ్ జరిగింది. ఎక్కడ లేని విధంగా స్మిమ్ సూట్‌లలో వచ్చి కొంత మంది పౌరులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Australia) ఆస్ట్రేలియాలో తాజాగా వింతైన పోలింగ్ జరుగుతోంది. కొంత మంది పౌరులు (Voting in swimsuits) స్విమ్ సూట్‌లలో వచ్చి ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఎందుకంటే.. ఆస్ట్రేలియాలో ఓటింగ్ అనేది కేవలం ఓటు వేసే ప్రక్రియ కాదు, అది ఒక ప్రత్యేక సంస్కృతిగా మారిపోయింది. ‘డెమోక్రసీ సాసేజ్’ (Democracy Sausage) అనే పేరుతో ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో అందించే సాసేజ్ బ్రెడ్ ఇప్పుడు ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింభించే చిహ్నంగా మారింది. సాధారణంగా గ్రిల్ చేసిన సాసేజ్‌ను బ్రెడ్‌లో పెట్టి, ఉల్లిపాయలు, కెచప్ వేసి అందిస్తారు. కానీ ఎన్నికల రోజున ఇది ఓ జాతీయ ఉత్సవానికి చిహ్నంగా మారుతుంది. ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. "కొంతమంది పర్యాటకులు, విదేశీ విద్యార్థులు కూడా ఓటు వేయకపోయినా, ఈ సాసేజ్ తినడం కోసం పోలింగ్ కేంద్రాలకు వస్తారు. ఇది వారి కోసం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది," అని అన్నారు.
ఇక మరో వినూత్న సంప్రదాయం ఓటింగ్‌కు ఈత దుస్తుల్లో రావడం. రాజ్యాంగంలో ఓటింగ్‌కి డ్రస్ కోడ్ లేదన్న కారణంగా బీచ్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు బీచ్ నుంచి నేరుగా ఈత దుస్తుల్లోనే ఓటు వేయటానికి వస్తారు. “ఇది ప్రజాస్వామ్యానికి ఓ ప్రత్యేకమైన గుర్తు” అని బాండి ప్రాంతానికి చెందిన ఓటరు నిక్ ఫాబ్రి తెలిపారు. ఆస్ట్రేలియాలో ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు, అది ఉత్సాహంగా, వినోదంతో కూడిన అనుభవం కూడా అని ఈ వినూత్న సంప్రదాయాలు నిరూపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన మంత్రి ఆంథనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి రావచ్చని సర్వేలు సూచిస్తున్నాయి.






